e-Paper
Wednesday, September 16, 2026
Homeతెలంగాణమంగళవారం భాగ్యనగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మంగళవారం భాగ్యనగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

📰 Generate e-Paper Clip

ఆదాబ్ సైబరాబాద్, శంశిగుడా : చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో జూన్ 16 (మంగళవారం)న కూకట్‌పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

మొదటి విడతలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హెచ్‌ఎంటీ హిల్స్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫేజ్-2 ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ సమయంలో భాగ్యనగర్ ఫేజ్-2, అర్జున్ థియేటర్ రోడ్ ప్రాంతాలు విద్యుత్ అంతరాయానికి గురికానున్నాయి.

అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెచ్‌ఎంటీ హిల్స్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ జలవాయువిహార్ ఫీడర్‌పై నిర్వహణ పనులు చేపట్టనున్నారు. దీంతో జేఎన్‌టీయూ పోలీస్ స్టేషన్ నుంచి కళామందిర్ రోడ్ వరకు, కేపీహెచ్‌బీ మెయిన్ రోడ్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

నిర్వహణ పనులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ఈ కారణంగా ప్రజలకు కలిగే తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఏఈ (ఆపరేషన్స్), భాగ్యనగర్ ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!