e-Paper
Thursday, September 17, 2026
Homeతెలంగాణఉచిత ప్రయాణ పథకానికి గండి?

ఉచిత ప్రయాణ పథకానికి గండి?

📰 Generate e-Paper Clip

  • టార్గెట్ పేరుతో తప్పుడు టికెట్లు జారీ చేసిన కండక్టర్
  • కండక్టర్ ను నిలదీసిన సీసీ కెమెరా టెక్నీషియన్ స్టూడెంట్ సౌమ్య
  • మహిళ ఆగ్రహం, విచారణకు డిమాండ్

ఆదాబ్ సైబరాబాద్, షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో కొందరు కండక్టర్లు వ్యవహారశైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికులు ఎక్కిన ప్రదేశానికి బదులుగా వేరే స్టాప్ నుంచి టికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాజాగా ఓ మహిళ స్వర్ణభారత్ ట్రస్ట్ లో సీసీ కెమెరా టెక్నీషియన్ గా నేర్చుకుంటున్న సౌమ్య అనే మహిళ ఆరంగర్ నుంచి మదనపల్లిలో దిగవలసిన ఆమెకు కండక్టర్ అక్కడ స్టాప్ లేదు అనడంతో ఆ మహిళ ఆరంగర్ నుండి శంషాబాద్ వరకు టికెట్ ఇవ్వండి అని కండక్టర్ ను కోరింది.

కండక్టర్ మాత్రం శివరాంపల్లి నుండి కిషన్ గూడ వరకు టికెట్ ఇచ్చారు. వెంటనే కండక్టర్ ను ఆ మహిళ
నేను శివరాంపల్లి లో బస్సు ఎక్కలేదు..? అక్కడి నుడి మాకు టికెట్ ఎందుకు కొట్టారు. అని నిలదీసింది. అలాగే శివరాంపల్లి లో బయలుదేరిన బస్సు టైమ్ ఏంటి నాకు అందించిన టికెట్ టైమింగ్ చూడండి అని ప్రశ్నించింది.ఆ కండక్టర్ మేము ఇలాగే టికెట్ ఇస్తాం ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో… మా ఫోటో వీడియో తీసుకుంటావా…? తీసుకో… అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణ పథకం లక్ష్యానికి భంగం కలిగించేలా ఇలాంటి చర్యలు ఉంటే వాటిపై రవాణా శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని ఆ మహిళ డిమాండ్ చేశారు. టార్గెట్‌ల పేరుతో తప్పుడు టికెట్లు జారీ చేస్తున్నట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఆర్టీసీ సంబంధి అధికారులు స్పందించి వాస్తవాలు వెలికితీసి, ప్రయాణికుల్లో అపోహలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!