e-Paper
Tuesday, September 15, 2026
Homeతెలంగాణహైదరాబాద్పర్యాటక ప్రాజెక్టుల వేగవంతానికి సీఎం ఆదేశాలు

పర్యాటక ప్రాజెక్టుల వేగవంతానికి సీఎం ఆదేశాలు

📰 Generate e-Paper Clip

ఎకో టూరిజం, వికారాబాద్ అభివృద్ధి, దుర్గం చెరువు, తారామతి బారాదరిపై ప్రత్యేక దృష్టి

ఆదాబ్ సైబరాబాద్, వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ చేపడుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసి ఎకో టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన సీఎం, తారామతి బారాదరిని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడంతో పాటు దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అలాగే మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు.టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి, యాదగిరిగుట్ట తరహాలో పాలక మండలిని ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే క్యూర్ (CURE) పరిధిలో అర్బన్ ఫారెస్ట్ నమూనాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, ప్రత్యేక అధికారులను నియమించి పనులు వేగవంతం చేయాలని చెప్పారు.

నగరంలోని పురానాపూల్ వంటి చారిత్రక వంతెనలను వారసత్వ సంపదగా పరిరక్షిస్తూ పర్యాటక ఆకర్షణలుగా తీర్చిదిద్దాలని, అవసరమైతే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా వచ్చే డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!