e-Paper
Wednesday, September 16, 2026
Homeతెలంగాణమేడ్చెల్ మల్కాజ్‌గిరిసాహెబ్ నగర్‌లో రోడ్డు విస్తరణ ప్రభావిత ప్రాంతాల పరిశీలన.. ప్రజలకు అన్యాయం జరగనివ్వమని జిట్టా రాజశేఖర్...

సాహెబ్ నగర్‌లో రోడ్డు విస్తరణ ప్రభావిత ప్రాంతాల పరిశీలన.. ప్రజలకు అన్యాయం జరగనివ్వమని జిట్టా రాజశేఖర్ రెడ్డి హామీ

📰 Generate e-Paper Clip

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) జారీ చేసిన రోడ్డు విస్తరణ నోటీసుల నేపథ్యంలో, ఈరోజు సాహెబ్ నగర్‌లో స్థానిక గ్రామస్తులతో కలిసి జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.రోడ్డు విస్తరణలో భాగంగా ఏయే కుటుంబాల స్థలాలు ఎంత మేరకు ప్రభావితమవుతున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించి, స్థానిక ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని, వారి హక్కులను కాపాడేందుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గంగం శివశంకర్‌తో పాటు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!