e-Paper
Saturday, September 12, 2026
Homeతెలంగాణమేడ్చెల్ మల్కాజ్‌గిరిచలాన్ల పేరుతో ప్రజలను వేధించొద్దు

చలాన్ల పేరుతో ప్రజలను వేధించొద్దు

📰 Generate e-Paper Clip

కుషాయిగూడ బస్‌స్టాప్ వద్ద ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం

కుషాయిగూడ: కుషాయిగూడ బస్‌స్టాప్ పరిసరాల్లో నో పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు అడ్డగోలుగా చలాన్లు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. షాపుల షెడ్ల కింద నిలిపిన ద్విచక్ర వాహనాలను రోడ్డుపైకి తీసుకొచ్చి ఫోటోలు తీసి చలాన్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులు వేధింపులకు పాల్పడకుండా న్యాయమైన పార్కింగ్ నిబంధనలు అమలు చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!