సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ విందు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంలో ఘనంగా జరిగింది. పాల్గొన్న నాయకులు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
