e-Paper
Saturday, September 12, 2026
Homeతెలంగాణవైన్సులు బార్లు బంద్ - బోనాల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు

వైన్సులు బార్లు బంద్ – బోనాల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు

📰 Generate e-Paper Clip

ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వైన్ షాపులు, తాటి కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను తాత్కాలికంగా మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్–20 ప్రకారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ మేరకు ఆగస్టు 9, 2026 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

 

ఈ ఉత్తర్వులు కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని వైన్ షాపులు, తాటి కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లకు వర్తిస్తాయి. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు, ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!