e-Paper
Saturday, September 12, 2026
Homeతెలంగాణఫతేనగర్‌లో శ్రీ చిత్తారమ్మ తల్లి పలారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహణ.. బీజేపీ సీనియర్ నాయకుడు...

ఫతేనగర్‌లో శ్రీ చిత్తారమ్మ తల్లి పలారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహణ.. బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరు

📰 Generate e-Paper Clip

ఫతేనగర్‌లో శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ తల్లి పలారం బండి ఊరేగింపు కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కంచి మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మహేందర్ యాదవ్ ఆహ్వానం మేరకు విచ్చేసిన రాజేశ్వరరావుకు కంచి మహేందర్ యాదవ్ మిత్రమండలి సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం పలారం బండి ఊరేగింపు ఫోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనలతో భక్తి వాతావరణంలో వైభవంగా కొనసాగింది.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ చిత్తారమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, మిత్రమండలి సభ్యులకు నిర్వాహకుడు కంచి మహేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!