ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్: నియోజకవర్గం 130వ డివిజన్ ఉపాధ్యక్షుడు దొడ్ల నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి, దొడ్ల నాగేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు సాగాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ సోమన్నగారి శ్రీధర్ రెడ్డి, డీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు కరణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరికిరణ్ పటేల్, నరసింహ గౌడ్, రామచందర్, చందు, రాజు చారి, ఎండి గఫ్ఫార్ తదితరులు పాల్గొని దొడ్ల నాగేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
