e-Paper
Saturday, August 1, 2026
Homeతెలంగాణఎల్లమ్మబండలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం

ఎల్లమ్మబండలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

  • విద్యార్థులకు వ్యాసరచన పోటీలు..

  • దత్తాత్రేయ కాలనీలో వాలీబాల్ టోర్నమెంట్

ఆదాబ్ సైబరాబాద్, జగద్గిరిగుట్ట : మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక యువత, విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు దత్తాత్రేయ కాలనీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి.. క్రీడలకు అవును చెప్పండి” అనే సందేశంతో ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించగా, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!