e-Paper
Thursday, September 17, 2026
Homeతెలంగాణవిస్తృతంగా పల్స్ పోలియో కార్యక్రమం

విస్తృతంగా పల్స్ పోలియో కార్యక్రమం

📰 Generate e-Paper Clip

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన బండి రమేష్

ఆదాబ్ సైబరాబాద్, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పూర్తిస్థాయి పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు, వైద్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ బాపమ్మాయి, హెల్త్ అసిస్టెంట్లు రోజా, సుజాత, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడికిటి గోపాల్ చౌదరి, రంగమోహన్, రామారావు, చలసాని నళినీకాంత్, కళ్యాణ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!