e-Paper
Tuesday, September 15, 2026
Homeరాజకీయంజీడిమెట్లలో జై దుర్గా భవాని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభం

జీడిమెట్లలో జై దుర్గా భవాని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభం

📰 Generate e-Paper Clip

కుత్బుల్లాపూర్: సంఘ సభ్యులంతా ఐక్యంగా ఉండి, సంఘ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పిలుపునిచ్చారు.ఆదివారం 132వ డివిజన్ జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై దుర్గా భవాని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, చింతల్–కుత్బుల్లాపూర్ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెంట్రింగ్ కార్మికులు సంఘటితంగా ఉంటేనే వారి సమస్యల పరిష్కారం సులభమవుతుందని అన్నారు. కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా సంఘం కృషి చేయాలని, సభ్యులంతా సంఘం బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ జోన్ జనరల్ సెక్రటరీ ఎండి. చాంద్ పాషా, ప్రెసిడెంట్ కుంట వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్. సత్తిబాబు, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాకేష్, క్యాషియర్ శివశంకర్, శ్రీనివాస్, ఆర్గనైజర్లు ఈశ్వర్, కృష్ణ, మహంకాళి రావు, సత్యనారాయణ, ముని, సంజీవులు, వెంకటేశ్వరరావు, ఇంద్రసేనారెడ్డి, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, అశోక్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!