e-Paper
Tuesday, September 15, 2026
Homeక్రైమ్ న్యూస్అమ్మబాబోయి అంత కళ్తే నా..!

అమ్మబాబోయి అంత కళ్తే నా..!

📰 Generate e-Paper Clip

100 రోజుల్లో 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం

121 టన్నులకుపైగా కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం.. ప్రజల సహకారంతోనే విజయమని హైదరాబాద్ సీపీ

హైదరాబాద్: ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక విభాగం హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమైన హెచ్-ఫాస్ట్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన వివరాల ప్రకారం, నగరవ్యాప్తంగా 185 కేసులు నమోదు చేసి 121.87 టన్నులకుపైగా కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.

టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఆధ్వర్యంలో 36 మంది అధికారులు, సిబ్బంది జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగరంలోని హోటళ్లు, బేకరీలు, మాంసం విక్రయ కేంద్రాలు, ఆహార తయారీ యూనిట్లపై నిరంతరం దాడులు, తనిఖీలు నిర్వహించారు.

జోన్ల వారీగా రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21, శంషాబాద్‌లో 13, జూబ్లీహిల్స్‌లో 12, ఖైరతాబాద్‌లో 5 కేసులు నమోదయ్యాయి.

తనిఖీల్లో 27 టన్నులకుపైగా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 25 టన్నులకుపైగా రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు, 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, కల్తీ కోవా, టీ పొడి, నాసిరకం మాంసం, క్రీమ్, నెయ్యి, పనీర్, పెరుగు, డ్రైఫ్రూట్స్ తదితర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక తదుపరి చర్యల కోసం 247 కేసులను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. వీటిలో పనీర్ విక్రయ కేంద్రాలు, సమోసా తయారీ కేంద్రాలు, వాటర్ ప్లాంట్లు, బేకరీలు, హాస్టళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, మాంసం దుకాణాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.

ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ, ఆహార కల్తీ అనేది కేవలం వ్యాపార మోసం కాదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నేరమని అన్నారు. కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో కల్తీ ఆహార తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్-100 లేదా H-FAST వాట్సాప్/హెల్ప్‌లైన్ నంబర్ 8712661212కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!