e-Paper
Tuesday, September 15, 2026
Homeతెలంగాణఏసీబీకి చిక్కిన తహసీల్దార్

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

📰 Generate e-Paper Clip

  • భూ సమస్య పరిష్కారం పేరుతో రూ.70 వేల లంచం డిమాండ్
  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఆదాబ్ సైబరాబాద్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో తహసీల్దార్ దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన ఓ రైతు నుంచి దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచం చెల్లిస్తేనే పని చేస్తానని స్పష్టం చేయడంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి, తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి రూ.70 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో దిలీప్ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న నగదును స్వీకరించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!