-
మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా జెట్టింగ్ మిషన్ ప్రారంభం
-
శంకర్‌పల్లి అభివృద్ధికి రూ.80 కోట్ల ప్రతిపాదనలు
-
మంత్రి ముందు రూ.80 కోట్ల అభివృద్ధి ప్రణాళికలు..
-
సానుకూల స్పందన
-
శంకర్‌పల్లి పట్టణాభివృద్ధికి మరో ముందడుగు
ఆదాబ్ సైబరాబాద్, శంకర్ పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డి శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా బీడీఎల్ రోడ్ జంక్షన్ అభివృద్ధి పనులు మరియు జెట్టింగ్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పట్టణ అభివృద్ధికి అత్యవసరమైన పనుల కోసం సుమారు రూ.80 కోట్ల ప్రతిపాదనలను మంత్రికి సమర్పించారు. ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ జూలకంటి శ్వేత పాండురంగ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ఏ. యోగేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
