e-Paper
Saturday, August 1, 2026
Homeతెలంగాణసైబర్ భద్రతపై ప్రత్యేక డ్రైవ్..'కాఫీ విత్ ఎ కాప్' కార్యక్రమం

సైబర్ భద్రతపై ప్రత్యేక డ్రైవ్..’కాఫీ విత్ ఎ కాప్’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

  • హెచ్‌ఎస్‌బీసీ హైదరాబాద్ క్యాంపస్‌లో సైబరాబాద్ పోలీసుల సమావేశం

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఎస్‌బీసీ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘కాఫీ విత్ ఎ కాప్’ కార్యక్రమం ఐదో విడత విజయవంతంగా నిర్వహించారు. “డిజిటల్ డిలెమాస్: లెట్స్ నావిగేట్ ఇట్ టుగెదర్” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌బీసీ ఉద్యోగులు సైబర్ భద్రత, డిజిటల్ మోసాల నివారణ, బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ వినియోగంపై అవగాహన పొందారు.

సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ కె. పుష్ప, ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పాల్గొని సైబర్ నేరాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద సందేశాలు, లింకులు, కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ “ఆగండి.. ధృవీకరించండి.. రక్షించుకోండి” అనే సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఎస్‌సీఎస్‌సీకి చెందిన రష్మి శ్రీవాస్తవ, హెచ్‌ఎస్‌బీసీ & ఎస్‌సీఎస్‌సీ ఉమెన్స్ సేఫ్టీ ఫోరమ్‌కు చెందిన మమత మదిరెడ్డిలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజం–పోలీసుల మధ్య మరింత సాన్నిహిత్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!