జీడిమెట్లలో 2022లో ఇద్దరు కార్మికుల మృతికి కారణమైన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో నిందితుడు భునేశ్వర్ సింగ్‌కు మెద్చల్ II అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉద్యోగం రాకపోవడంతో ఇద్దరిని కర్రతో హత్య చేసి, నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు గ్యాస్ లీక్ చేసి నిప్పంటించడంతో పేలుడు సంభవించినట్లు దర్యాప్తులో తేలింది. హత్య కేసులో జీవిత ఖైదుతో పాటు, అగ్నిప్రమాదం సృష్టించిన కేసులో 10 ఏళ్లు, సాక్ష్యాల నాశనం కేసులో 3 నెలల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది.
JEEDIMETLA : గ్యాస్ పేలుడు కేసులో నిందితుడికి జీవిత ఖైదు
RELATED ARTICLES
