e-Paper
Tuesday, September 15, 2026
Homeతెలంగాణమేడ్చెల్ మల్కాజ్‌గిరి217వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ

217వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఆదాబ్ సైబరాబాద్ , కాప్రా: కాప్రా మండల్ జమ్మిగడ్డ బీజేఆర్ కాలనీలో జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో 217వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే మహనీయుల ఆశయాలను ప్రజలు ఆచరించాలని పిలుపునిచ్చారు. వారి బాటలో నడుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జ్ఞానమాల టీం సభ్యులు ఎన్. సతీష్ బాబు, ఎస్.ఎ. రహీం, నర్సింహ్మ చారి, రవి నాయక్, దయానంద్, లక్ష్మీనారాయణ, నగేష్, రాము పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్ఞానమాల టీం ఆర్గనైజర్ తాడూరి గగన్ కుమార్ సమన్వయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!