ఆదాబ్ సైబరాబాద్ , జవహర్‌నగర్: జవహర్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పరిశీలించారు. ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి బూత్ స్థాయిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ఇంటింటికీ వెళ్లి పరిశీలనలు చేపట్టాలని పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పరిశీలన
RELATED ARTICLES
