ఆదాబ్ సైబరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, :
నకిలీ స్థిరాస్తి పత్రాలను సృష్టించి వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి రూ.4.11 కోట్ల విలువైన గృహ రుణాలు పొందిన మోసాన్ని కీసర పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి నకిలీ ఆస్తి పత్రాలు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు రికార్డులు తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను నమ్మబలికి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
