పీఐడీ లయన్ డా. ఘట్టమనేని బాబురావు
320-బి జిల్లా నూతన కమిటీ బాధ్యతల స్వీకారం
జిల్లా గవర్నర్: శైలజా నాయర్
ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్: అవంతి రెడ్డి
సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్: చల్లా శ్రీనివాస్ రెడ్డి
ఆదాబ్ సైబరాబాద్, కొంపల్లి: లయన్స్ ఇంటర్నేషనల్ 320-బి జిల్లా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అన్ని లయన్స్ క్లబ్బులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని పీఐడీ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు.
కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 320-బి జిల్లా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంలో నూతన జిల్లా గవర్నర్‌గా శైలజా నాయర్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా అవంతి రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా చల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఐడీ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ, జిల్లా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శైలజా నాయర్ సేవాభావం, పట్టుదల కలిగిన నాయకురాలని కొనియాడారు. ఆమె నాయకత్వంలో జిల్లాలోని అన్ని లయన్స్ క్లబ్బులు మరింత చురుకుగా సేవా కార్యక్రమాలను విస్తరించి సమాజానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నేత్రదానం ఆవశ్యకతపై అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఇన్‌స్టాలేషన్ చైర్మన్ హలోక్ కుమార్ జా, మాజీ జిల్లా గవర్నర్లు సెల్వ సాయిరాం రాజు, రాజేంద్ర ప్రసాద్, ఎస్.ఎన్. రెడ్డి, దీపక్ భట్టాచార్య, విద్యాసాగర్ రావు, విజయ్ కుమార్ శెట్టి, మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ హేమల్ కన్విద్‌తో పాటు పలువురు లయన్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
