e-Paper
Friday, July 31, 2026
Homeరాజకీయంపచ్చని కూకట్‌పల్లి లక్ష్యంగా మొక్కల పంపిణీ – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బండి...

పచ్చని కూకట్‌పల్లి లక్ష్యంగా మొక్కల పంపిణీ – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బండి రమేష్ పిలుపు

📰 Generate e-Paper Clip

కూకట్‌పల్లి: హైదరాబాద్‌ను హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్ పిలుపునిచ్చారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వసంతనగర్ డివిజన్ గోపాలనగర్ కాలనీ పార్కులో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శ్రీ రోహిత్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ చక్రపాణి సహకారంతో, మందలపు రోజారమణి ట్రస్ట్ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకుడు శ్రీ సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా బండి రమేష్ మొక్కలు నాటి కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వనమహోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఏడాదిలో 16 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి కుటుంబం కనీసం నాలుగైదు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, వృక్షాలను కాపాడటం అంటే భావితరాల భవిష్యత్తును కాపాడినట్టేనని బండి రమేష్ అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని, మొక్కల పెంపకాన్ని ప్రతి కుటుంబం సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.ప్రజాహిత కార్యక్రమాన్ని నిర్వహించిన సాయిబాబా చౌదరిని ఆయన అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విస్తృతంగా మొక్కల పంపిణీ, నాటే కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వసంతనగర్, కేపీహెచ్‌బీ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసబాబు, అరవింద్ రెడ్డి, రంగమోహన్, శివ, ప్రవీణ్, రామకృష్ణ, సత్యనారాయణ, రామారావుతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!