e-Paper
Tuesday, September 15, 2026
HomeGHMCబాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

📰 Generate e-Paper Clip

నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

గత 12 సంవత్సరాల కాలంలో కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కాలనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. జగదీష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్. దయానంద్, ఉపాధ్యక్షులు మాల్యాద్రి, బాబురావు, కె.వి. రాజేష్, సంయుక్త కార్యదర్శులు రాజారెడ్డి, రాజు యాదవ్, దత్తాత్రేయ, ఎల్వీవీ రామాంజనేయులు, జైపాల్ రెడ్డి, కోశాధికారి మధుసూదన్, కార్యనిర్వాహక కార్యదర్శులు శ్రీధర్ కుమార్, రవి, లక్ష్మీనారాయణ గౌడ్, సభ్యులు సత్తిబాబు, శ్రీరామచంద్రమూర్తి, కె.వి. రాజేంద్రప్రసాద్, కె. నరేష్, శ్రీరామ్, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!