ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి
ఆదాబ్ సైబరాబాద్ : కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 290వ డివిజన్ సుభాష్‌నగర్‌లోని ఎస్‌ఆర్ నాయక్‌నగర్‌కు చెందిన వెంకటమణి కుమార్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.3 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) కాపీని మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు, మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, కూన రాఘవేంద్ర గౌడ్, ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సాంబశివరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
