e-Paper
Wednesday, September 16, 2026
Homeరాజకీయంబీఎంఎస్ 72వ వ్యవస్థాపక దినోత్సవం: జీడిమెట్లలో బీఎంఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

బీఎంఎస్ 72వ వ్యవస్థాపక దినోత్సవం: జీడిమెట్లలో బీఎంఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల మెయిన్ రోడ్ నేషనల్ హైవే వద్ద బీఎంఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పాల్గొని బీఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రతి కార్మికుడు సంఘటితంగా ముందుకు సాగి సమాజ అభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఎంఎస్ అధ్యక్షులు ప్లంబర్ రాజు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు, చిలుకూరి శ్యామ్, కాలే శంకర్, కాలే ఎట్టయ్య, బియ్యం శంకర్, శ్రీనివాస్, పోల గంగాధర్, ప్రవీణ్ గౌడ్, అరవింద్, సతీష్, ఎశ్వంత్, పాపయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!