e-Paper
Sunday, September 13, 2026
Homeతెలంగాణషాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆరంభం

షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆరంభం

📰 Generate e-Paper Clip

చౌరస్తాలో కూల్చివేతలు

షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. షాద్‌నగర్ ప్రధాన చౌరస్తా విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణ సీఐ సీతారాంతో పాటు పలువురు ఎస్‌ఐలు, భారీగా పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో చౌరస్తా వద్దకు చేరుకున్నారు. రోడ్డు విస్తరణకు సహకరిస్తూ కొందరు వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను.తొలగించుకుంటుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు బలవంతంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం చౌరస్తా పరిసరాల్లో కూల్చివేతల ప్రక్రియ నిర్భటంకంగా కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!