శేరిలింగంపల్లి: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని శశిధర్ గారికి రాఖీలు కట్టి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.ఈ సందర్భంగా మహిళా సోదరీమణులు ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన ప్రతి సోదరీమణికి పట్వారీ శశిధర్ బహుమతులు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో సోదరభావంతో మమేకమై వారి ఆప్యాయతను స్వీకరించారు.అనంతరం పట్వారీ శశిధర్ మాట్లాడుతూ, సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి రక్షా బంధన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి సోదరి సంతోషంగా, సురక్షితంగా ఉండేలా అండగా నిలబడటం ప్రతి సోదరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రక్షా బంధన్ సందర్భంగా సోదరీమణుల ఆశీస్సులు, ఆత్మీయత తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తెలిపారు.ప్రతి కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులతో కలిసి రాఖీ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పట్వారీ శశిధర్ తెలిపారు.ఈకార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మహిళా సోదరీమణులు, డివిజన్ మహిళా నాయకులు, కార్యకర్తలు, టీం పట్వారీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పట్వారీ శశిధర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
RELATED ARTICLES
