e-Paper
Thursday, July 30, 2026
HomeGHMCవిద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

📰 Generate e-Paper Clip

చెట్ల కొమ్మల తొలగింపు కారణం

దుందిగల్ ప్రాంతాల్లో నిలిపివేత

ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్-మల్కాజిగిరి : దుండిగల్ 33 కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ రోజు పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది. ఎఫ్-2 ఫీడర్ పరిధిలో గాగిళ్లాపూర్ ఎక్స్ రోడ్, చర్చ్ ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

చైతన్య కాలనీ ఫీడర్ పరిధిలో చైతన్య కాలనీ, ఏపీఆర్ గ్రూప్, గాగిళ్లాపూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా ఉండదు. అలాగే విర్చో ఫీడర్ పరిధిలో గాగిళ్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది.

తండా ఫీడర్ పరిధిలో తండా-1, తండా-2 ప్రాంతాలు, సుందర్ ఆశ్రమ్ ఫీడర్ పరిధిలో దుండిగల్ గ్రామం మరియు పరిసర కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

రామ్‌కీ ఫీడర్, బీహెచ్ఈఎల్ ఫీడర్, గండిమైసమ్మ ఫీడర్, సరేగూడెం ఫీడర్, బౌరంపేట్ వ్యవసాయ ఫీడర్ పరిధిలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గండిమైసమ్మ ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ పరిసరాలు, శ్లోకా స్కూల్ ప్రాంతంతో పాటు సరేగూడెం, రాజరాజేశ్వరి కాలనీ ప్రాంతాలు ఈ అంతరాయానికి గురికానున్నాయి.

విద్యుత్ నిర్వహణ పనులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.

ఈ మేరకు ఏఈ (ఆపరేషన్స్) డీపల్లి డి. సమ్మయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!