e-Paper
Thursday, September 17, 2026
Homeతెలంగాణజీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

📰 Generate e-Paper Clip

మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్యక్రమం
పోటీలో పాల్గొనే జట్టు 24 జూన్ లోపు పేరు నమోదు చేయాకోవలని కోరిన
జీడిమెట్ల ఇంస్పెక్టర్ గడ్డం మల్లేష్

ఆదాబ్ సైబరాబాద్, జీడిమెట్ల : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గడ్డం మల్లేష్ తెలిపారు. “క్రీడలకు అవును… మాదకద్రవ్యాలకు కాదు” అనే నినాదంతో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ వాలీబాల్ పోటీలు జూన్ 25, 2026 (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించబడనున్నాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పౌరులు పోటీల్లో పాల్గొనడంతో పాటు వీక్షించేందుకు ఆహ్వానితులని తెలిపారు.

పోటీల్లో పాల్గొనదలిచిన వారు స్థానిక నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు ప్రతిని సమర్పించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వారికే పోటీల్లో పాల్గొనే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. జట్ల వారీగా ఎంట్రీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పోటీలకు నమోదు చేసుకునే చివరి తేదీ జూన్ 24, 2026 సాయంత్రం 6 గంటల వరకు అని తెలిపారు.

పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దశరథ్ (9032324504) ను సంప్రదించవచ్చని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మొగ్గుచూపి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత జీడిమెట్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “క్రీడల్లో పాల్గొనండి, ప్రోత్సహించండి, మాదకద్రవ్య రహిత సమాజం కోసం సందేశాన్ని విస్తరించండి” అని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!