e-Paper
Thursday, September 17, 2026
Homeతెలంగాణమేడ్చెల్ మల్కాజ్‌గిరిఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ రద్దు కుట్రను విరమించుకోవాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ రద్దు కుట్రను విరమించుకోవాలి

📰 Generate e-Paper Clip

బీసీ సంఘాల డిమాండ్

కూకట్‌పల్లి : ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను రద్దు చేసే ప్రభుత్వ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు.

ఈ డిమాండ్లతో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నాయకత్వం వహించారు.

ఈ దీక్షకు తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జి. బ్రహ్మేంద్ర, తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు, జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, గుజ్జ సత్యం, నీలగోపాల్, మల్లేష్ యాదవ్, రామ్మూర్తి గౌడ్, పృథ్వి గౌడ్, నిఖిల్, గోపాల్, సీహెచ్. ప్రకాష్, ఉద్యమ గాయకుడు రామలింగం బృందం తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కీలకమని, దానిని బలోపేతం చేయాల్సింది పోయి రద్దు చేసే ప్రయత్నాలు చేయడం తగదని నాయకులు ప్రభుత్వానికి హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!