e-Paper
Saturday, August 1, 2026
Homeతెలంగాణలులు మాల్లో లైసెన్సెడ్ పిస్టల్ కలకలం

లులు మాల్లో లైసెన్సెడ్ పిస్టల్ కలకలం

📰 Generate e-Paper Clip

కూకట్‌పల్లిలో ప్రాంతంలోని లులు మాల్‌లో భద్రతా నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. మాల్ పార్కింగ్‌లో రెండు కత్తులతో ప్రవేశించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనతో మాల్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. మాల్ పార్కింగ్‌లో రెండో అంతస్తులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించిన మంగల్హాట్ అగ్రశ్రేణి జడ్జికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతని వద్ద లైసెన్స్ లేని పిస్టల్‌తో పాటు రెండు కత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

 

ఈ ఘటన నేపథ్యంలో మాల్ భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ఆరా తీశారు. ఆయుధాలను గుర్తించే స్కానింగ్ పరికరాలు, భద్రతా తనిఖీలు సక్రమంగా నిర్వహించి ఉంటే ఇలాంటి ఘటన జరిగేదే కాదని అధికారులు అభిప్రాయపడ్డారు.ప్రాథమిక విచారణలో మాల్‌లో ప్రవేశించే సమయంలో భద్రతా తనిఖీల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో, మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మాల్స్‌లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!