e-Paper
Tuesday, September 15, 2026
Homeజాతియంబీజేపీ సీనియర్ నాయకుడు ఆర్శనపల్లి సూర్యరావుకు ఘన జన్మదిన వేడుకలు

బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్శనపల్లి సూర్యరావుకు ఘన జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

  • కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయంలో శాలువాతో సన్మానం

ఆదాబ్ సైబరాబాద్, కూకట్‌పల్లి : రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్శనపల్లి సూర్యరావు జన్మదిన వేడుకలు కూకట్‌పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్యరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని ఆర్శనపల్లి సూర్యరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పుష్పవృక్షాన్ని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఆర్శనపల్లి సూర్యరావు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ సీనియర్ నాయకులు నాయినేని సూర్యప్రకాశ్‌రావు, ఆకుల వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి యంజాల పద్మయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆర్శనపల్లి సూర్యరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!