ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై చర్చ
ఆదాబ్ సైబరాబాద్, కూకట్పల్లి : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ గారిని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశల్), మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యా రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని జస్వంత్ రావు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ విధానం కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, కూకట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆయన స్వగృహంలో కలిసి నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, దేశల్ మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
