e-Paper
Tuesday, September 15, 2026
Homeరాజకీయంఆల్విన్ కాలనీ 124వ డివిజన్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ.. రాహుల్ గాంధీకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వంపై...

ఆల్విన్ కాలనీ 124వ డివిజన్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ.. రాహుల్ గాంధీకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శంషిగూడా చౌరస్తా నుంచి గుడ్ విల్ హోటల్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థులపై దాడులు, అరెస్టులు, ప్రతిపక్ష నాయకులపై చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, యువకులు, టీం పట్వారీ సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!