e-Paper
Tuesday, September 15, 2026
Homeరాజకీయంఢిల్లీ విద్యార్థులపై దాడులను ఖండిస్తూ శేరిలింగంపల్లిలో టీఆర్‌పీ నిరసన ర్యాలీ

ఢిల్లీ విద్యార్థులపై దాడులను ఖండిస్తూ శేరిలింగంపల్లిలో టీఆర్‌పీ నిరసన ర్యాలీ

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శేరిలింగంపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నరసయ్య గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమంలో టీఆర్‌పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించి, ర్యాలీ చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల గొంతును అణిచివేసే చర్యలు సమంజసం కాదని, విద్యార్థులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేసి వారి హక్కులు, భద్రతను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని, వారి స్వేచ్ఛ, భద్రత, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను అణచివేతతో కాకుండా చర్చలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామ్‌చందర్ యాదవ్, విజయలక్ష్మి, వాసుకి, పొనుగోటి సందీప్, యాప్రాల్ రాజు, పద్మ, శ్రీకాంత్, శాగంటి శ్రీనివాస్, సంగమ్మ, మంగమ్మ, యాది, తిరుమల్, ప్రశాంత్ నగర్, బసవతారక నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొని విద్యార్థులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!