e-Paper
Tuesday, September 15, 2026
Homeరాజకీయంయువతకు ఫిట్‌నెస్, క్రీడలే ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు బాట: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

యువతకు ఫిట్‌నెస్, క్రీడలే ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు బాట: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుని క్రీడల్లో రాణించేందుకు పవర్‌లిఫ్టింగ్ వంటి పోటీలు ఉత్తమ వేదికలుగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి. వివేకానంద అన్నారు. ఈ నెల 26న నిర్వహించనున్న WPC తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని టార్క్ & టోన్ ఫిట్‌నెస్ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంతో పాటు శక్తి క్రీడలను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలో మరిన్ని ప్రతిభావంతులైన పవర్‌లిఫ్టర్లను తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్ విభాగాల్లో పోటీలు నిర్వహించనుండగా, జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. విజేతలకు మొత్తం రూ.30 వేల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, మెడల్స్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉదయ్ కిరణ్, వర్ష, కీర్తన, ఆకాష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!