e-Paper
Wednesday, September 16, 2026
Homeరాజకీయంఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు

📰 Generate e-Paper Clip

శేరిలింగంపల్లి జూలై 21: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాసేవ పట్ల అంకితభావం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబాటుతో దేశవ్యాప్తంగా విశ్వసనీయ నాయకుడిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గుర్తింపు పొందారని అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరకు ఎదిగి, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ, దేశ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం బలమైన స్వరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఖర్గే సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు బల్లింగ్ యాదగిరి గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు జహంగీర్, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, యాద గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, పట్వారీ శశిధర్, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, గఫర్, దేవరాజ్, జావేద్, లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శ్రీహరి గౌడ్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, ఉపాధ్యక్షుడు నితిన్ గౌడ్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేందర్ ముదిరాజ్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు చంద్రమౌళి, రవి కుమార్, భరత్, ఖాజా, ముజీబ్, పద్మరావు, సుధాకర్, అంజద్, మహిళా కాంగ్రెస్ నాయకులు రామేశ్వరమ్మ, జయ, శాంత, స్వాతి, శిరీష, వహీదా, అనిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!