e-Paper
Wednesday, September 16, 2026
Homeరాజకీయంబృందావన్ కాలనీలో బీజేపీ నూతన పదాధికారులకు ఘన సన్మానం.

బృందావన్ కాలనీలో బీజేపీ నూతన పదాధికారులకు ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, శేర్లింగంపల్లి: రంగారెడ్డి అర్బన్ జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పార్టీ పదాధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియమితులైన శేషయ్య , బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన  నవీన్ గౌడ్,  రవీంద్ర బద్రి, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన యాదయ్యని శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, నూతన బాధ్యతలను స్వీకరించిన పదాధికారులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితభావంతో కృషి చేసి సంస్థకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా నియమితులైన నాయకులకు అభినందనలు తెలియజేస్తూ వారి సేవలు పార్టీ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!