e-Paper
Tuesday, September 15, 2026
Homeరాజకీయంశేరిలింగంపల్లి SIR సమీక్ష సమావేశం: జూలై 31లోగా బీజేపీ సానుభూతిపరుల ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయాలి.

శేరిలింగంపల్లి SIR సమీక్ష సమావేశం: జూలై 31లోగా బీజేపీ సానుభూతిపరుల ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయాలి.

📰 Generate e-Paper Clip

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై మియాపూర్‌లోని భూమి బ్యాంక్వెట్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర SIR కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, జోన్-3 ఇంచార్జి ఇంద్రసేన్ రెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ జూలై 31లోగా బీజేపీ సానుభూతిపరులైన ఓటర్లందరి ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేయాలని బీఎల్‌ఏలకు సూచించారు. ఇప్పటివరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 44 శాతం, అంటే 3,37,887 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు అందజేయడం జరిగిందని, ఇందులో బీజేపీ బీఎల్‌ఏల కృషి కీలకమని ఆయన పేర్కొన్నారు.రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, భవిష్యత్‌లో పోటీ చేయాలనుకునే నాయకులు తమ డివిజన్లలో బీఎల్‌ఏలకు అందుబాటులో ఉంటూ వారికి పూర్తి సహకారం అందించాలని కోరారు.ఆగస్టు 3 తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్‌లలో ఉంటే ఫారం-8 ద్వారా ఒకే బూత్‌లోకి మార్చే చర్యలు తీసుకోవాలని, 18 ఏళ్లు పూర్తయిన కొత్త ఓటర్ల నమోదు, అలాగే పార్టీ సానుభూతిపరుల ఓట్లను శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోకి మార్చేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు సూచించారు.ప్రతి రోజు బీఎల్‌వోలు వద్ద నుంచి వచ్చిన ఫారాల వివరాలు, పెండింగ్ సమాచారం సేకరించి నాయకత్వానికి అందజేయాలని, బీఎల్‌ఏలు లేని బూత్‌లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, శక్తి కేంద్ర ఇంచార్జులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!