e-Paper
Thursday, July 30, 2026
Homeరాజకీయంప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న పట్వారీ శశిధర్

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న పట్వారీ శశిధర్

📰 Generate e-Paper Clip

ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ పరిధిలోని శంషిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్గుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్, ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ హాజరై స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని, బూత్ స్థాయి అధికారులు అందజేసే గృహ గణన దరఖాస్తు పత్రంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఉద్దేశం ఎవరి ఓటు హక్కును తొలగించడం కాదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు సరైన వివరాలతో ఓటరు జాబితాలో నమోదు కావడమేనని తెలిపారు. అలాగే ప్రతి బూత్ స్థాయి అధికారి వద్ద డివిజన్‌లో నమోదైన ఓటర్ల వివరాలను తెలుసుకొని సమాచారం సేకరించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు కావూరి ప్రసాద్, మానేపల్లి సాంబశివరావు, భీమ్‌రావు, శ్రీనివాస్, బాబు, వెంకట్, మల్లేష్, వీరన్న, రాజన్న, నర్సింగ్‌రావు, సుబ్బు, దర్శన్, భూమన, దయాకర్, ప్రవీణ్, దశరథ్, నాగేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య, జగదీష్, కృష్ణ, మహిళా నాయకులు లలిత, కృష్ణవేణి, లక్ష్మి, యాదమ్మ, మమత, డి. లక్ష్మి, అర్చన, భాగ్యతో పాటు పట్వారీ బృందం సభ్యులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!